9, మార్చి 2010, మంగళవారం

రాధా మాధవ.....

గాయకులు : ఎస్.జానకి
స్వరకర్త : జి.బాలకృష్ణ ప్రసాద్
రాగం : హిందోళం

పల్లవి :

రాధా మాధవ రతి చరితం
బోధావహం శృతి భూషణం

చరణం-1 :

గహనే ద్వావపి గత్వా గత్వా
రహసి రతిం ప్రేరయతి సతి
విహరత స్తదా విలసంతౌ
విహతగృహాశౌ తౌ

చరణం-2 :

అవనత శిరసాప్యతి సుభగం
వివిధాలాపైర్వివశయతి
ప్రవిమల కరరుహరచన విలాసై--
ర్భువనపతితం భూషయతి

చరణం-3 :

ఏవం విచరన్ హేలా విముఖ--
శ్శ్రీ వేంకటగిరి దేవోయం
పావన రాధా పరిరంభ శుఖ--
శ్రీ వైభవ సుస్థిరో భవతి

* * *

వలచి వచ్చితి.....

గాయకులు : ఎస్.జానకి
స్వరకర్త : జి.బాలకృష్ణ
రాగం : హంసానంది

పల్లవి :

వలచి వచ్చితి నేను వానికి గాను
నెలవై మీ గొల్లవాడనే తానుండునంట

చరణం-1 :

చెందమ్మి కన్నులవాడు చేతిపిల్ల గోవివాడు
యిందు వచ్చె గంటిరా ఏమిరే యమ్మా
మందల పసువులవాడు మకరాంకముల వాడు
యందు నున్నాడు చెప్పరే ఏల దాచేరమ్మా

చరణం-2 :

నెమలి పించెము వాడు నీల మేఘ కాంతి వాడు
రమణుడాతడు, మొక్కే రమ్మనరమ్మా
చెచ్చర గోనేటివాడు శ్రీ వేంకటేశ్వరుడు
వచ్చి నన్ను గూడినాడు వాడు వోయమ్మా

* * *

చూడవమ్మ.....

గాయకులు : ఎస్.జానకి
స్వరకర్త : జి.బాలకృష్ణ ప్రసాద్
రాగం : మిశ్ర మాళవిగౌళ

పల్లవి :

చూడవమ్మ యశోదమ్మ
వాడల వాడల వరదలివిగో

చరణం-1 :
 పొంచి పులివాలు బెరుగు
మించు మించు మీగడలు
వంచి వారలువట్టిన
కంచపుటుట్ల కాగులివిగో

చరణం-2 :

పేరీ బేరని నేతులు
చూరల వెన్నల జున్నులును
ఆరగించి యట సగబాళ్ళు
పారవేసిన బానలివిగో

చరణం-3 :

తెల్లని కను దీగెల సోగల
చల్లలమ్మేటి జవ్వనుల
చేల్లినట్లనే శ్రీ వేంకటపతి
కొల్లలాడిన గురుతులివిగో

* * *

పలుమరు వుట్ల.....

గాయకులు : ఎస్.జానకి
స్వర కర్త : నేదునూరి కృష్ణమూర్తి
రాగం : ముఖారి

పల్లవి :

పలుమరు వుట్ల పండుగను
చిలుకు చిడుక్కని చిందగను

చరణం-1 :

ఊళ్ళ వీధుల వుట్లు కృష్ణుడు
తాళ్ళు దెగిపడ దన్నుచును
పెళ్ళు కటిల్లు పెటిల్లు చిటిల్లని
పెళ్ళుగ మ్రోసె పెనురవము

చరణం-2 :

నిగ్గుగ వేంకట నిలయుడుట్టిపా--
లగ్గలిక బగుల నడువగను
భగ్గు భగిల్లని పరమామృతములు
గుగ్గిలి పదనుగ గురియగును

* * *

చిన్ని శిశువు.....

గాయకులు : ఎస్.జానకి
స్వర కర్త : జి.బాలకృష్ణ ప్రసాద్
రాగం : మిశ్ర వకుళాభరణం


పల్లవి :

చిన్ని శిశువు చిన్ని శిశువు
ఎన్నడూ చూడ మమ్మ ఇటువంటి శిశువూ

చరణం-1 :

తోయంపు గురులతోడ దూగేటి శిరసు
చింత కాయలవంటి జడలగములతోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పాయక యశోదవెంట బారాడు శిశువు

చరణం-2 :

బలుపైన పోట్టమీది పాలచారలతోడ
నులివేడి వెన్న దిన్న నోరితోడ
చెలగి నేడిదే వచ్చి శ్రీ వేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు

* * *

సతులాల చూడరే.....

గాయకులు : ఎస్.జానకి
స్వరకర్త : జి.బాలకృష్ణ ప్రసాద్
రాగం : కాపి

పల్లవి :

సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి
గతలాయ నడురేయి గలిగే శ్రీ కృష్ణుడు

చరణం-1 :

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
ఎట్టు ధరియించెనే ఈ కృష్ణుడు
అట్టే కిరీటము నాభరణాలు ధరించి
ఎట్టనెదుట నున్నాడు ఈ కృష్ణుడు

చరణం-2 :

కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డడాయ నీకృష్ణుడు
అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగగూడి
యెదుటనే నిలుచున్నాడీ కృష్ణుడు

* * *

పరమ పురుషుడు.....

గాయకులు : ఎస్.జానకి
స్వర కర్త : జి.బాలకృష్ణ ప్రసాద్
రాగం : మోహన

చరణం:

పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు
మురహరుడు ఎదుట ముద్దుగారీ నిదివో

పల్లవి-1 :

వేద పురాణములలో విహరించే దేవుడు
ఆది మూలమైనట్టి అల బ్రహ్మము
శ్రీదేవి పాలిట జెలగే నిధానము
సేదదేరి యశోదకు శిశు వాయ నిదివో

పల్లవి-2 :

దేవతల గాచుటకు దిక్కైన విష్ణుడు
భావములొక్క రూపైన భావతత్వము
శ్రీ వేంకటాద్రిమీద జేరున్న యా వరదుడు
కైవసమై గొల్లెతల కౌగిళ్ళ నిదివో

* * *